POSTOFFICE RD Scheme 2026 -- పూర్తి వివరాలు, వడ్డీ,ప్రయోజనాలు ,ఎలా ఎక్కడ ఓపెన్ చేయాలి ?
india post RD Scheme 2026 -- పూర్తి వివరాలు
మీ దగ్గర ఉన్న డబ్బును ప్రతినెలా కొద్దికొద్దిగా పొదుపు చేసి భవిష్యత్తులో మంచి మొత్తాన్ని పొందాలనుకునేవారికి india post reccuring dopisite {RD} Scheme ఒక మంచి పొదుపు పథకం.
ఈ పథకం కేంద్రప్రభుత్వ అద్వర్యం లోని ఇండియా పోస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది. కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది.
అసలు india post RD అంటే ఏమిటి?
1.RD {Reccuring deposite} దీన్నే ఇంకోలా అనొచ్చు చిన్న మొత్తాల పొదుపు ఖాతా.అంటే ప్రతీ నెల ఒక నిర్ణీత మొత్తాన్ని రెగ్యులర్ గా 5 సంవత్సరాల పాటు డిపోసిట్ చేసే పొదుపు పధకం. తరువాత మెచ్యూరిటీ టైం లో మీరు చెల్లించిన మొత్తం మీద వడ్డీతో పాటు ఒకే సారి తీసుకోవచ్చును.
2.ఇలా పొదుపు చేసే క్రమంలో మనకు ఏదైనా అవసరం పడితే ఒక సంవత్సరం కట్టుకున్న తరువాత నుంచి కూడా లోన్ సదుపాయం ఉంటుంది.
ముఖ్యాంశాలు
1.స్కీం పేరు :- indiapost reccuring deposite{RD}చిన్న మొత్తాల పొదుపుఖాతా
2.కాల పరిమితి :- 5 సంవత్సరాలు {60 నెలలు}
3.వడ్డీ రేటు:- ప్రస్తుతం 6.7% {ప్రభుత్వం మార్పులు చేయవచ్చు}
4.కనీస నెలవారీ పొదుపు:- 100/- రూపాయలు
5.గరిష్ట పరిమితి:- లేదు
6.ఖాతా రకం:-సింగల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ అలాగే మైనర్ అకౌంట్ కూడా చేస్కోవచ్చు
7. ఒకవేళ 5 సంవత్సరాలు పూర్తి ఐన తరువాత కావాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించుకొనవచ్చు
8. అనివార్య కారణాల వాళ్ళ ఖాతా నడపలేకపోతే 3 సంవత్సరాల తరువాత 4% వడ్డీ రేటు తో ఖాతా ను క్లోజ్ చేస్కోవచ్చు
9. అతి ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగునంగా మీ మొబైల్లలోనే ఆన్లైన్ లో కట్టుకునే అవకాశం కూడా ఉంది 
RD అకౌంట్ ఎవరు ఓపెన్ చేయవచ్చు?
1.భారత దేశం లో ఉండే ప్రతి భారతీయ పౌరులు అర్హులే
2.18 సంవత్సరాలు పైబడిన వారు
3. అలాగే 18 సంవత్సరాల లోపు 10 సంవత్సరాలు పైబడిన వారు కూడా గార్దియన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
4.అలాగే ఒక మనిషి పేరు ఎన్ని అకౌంట్ లు ఐన ఓపెన్ చేసుకునే అవకాశం కూడా ఉంది
RD ఖాతా ఎలా ఓపెన్ చేయాలి
మీ దగ్గరలోని ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా కూడా ఈ ఖాతా తెరవవచ్చు
అకౌంట్ ప్రారంభించడానికి కావాల్సిన పత్రాలు
1.ఆధార్ కార్డు జెరాక్స్
2.పాన్ కార్డు జెరాక్స్
3.మొబైల్ నెంబర్ {ఖాతాకి సంబందించిన సమాచారం మెసేజ్ లో తెలుసుకోవడానికి }
4.4 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
5.నామినీ ఆధార్ కార్డు జెరాక్స్
ప్రతి నెల క్రమం తప్పకుండ పొదుపు చేసే అలవాటు పెంచుకోవాలనుకునే వారికీ ఈ RD అనేది ఒక మంచి ఎంపిక అనే చెప్పవచ్చు తక్కువ మొత్తం లో ప్రారంభించి భవిష్యత్తు అవసరాల కోసం నిధిని సిద్ధం చేస్కోవచ్చు
మీ అందరికి అర్థమయ్యేలా చిన్న పట్టిక రూపంలో
ఉదాహరణ 5 సంవత్సరాలలో మొత్తం
నెలవారి డిపోసిట్ మొత్తం
100/- 6000/- 7136/-
200/- 12000/- 14273/-
500/- 30000/- 35682/-
1000/- 60000/- 71365/-
2000/- 120000/- 142731/-
5000/- 300000/- 356829/-
10000/- 600000/- 713658/-
📌 మరిన్ని పోస్టల్ సేవల వివరాల కోసం
ఈ India Post Recurring Deposit (RD) గురించి సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.
పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, NSC, KVP, MIS, PPF, SSY, PLI, IPPB, పోస్టల్ అప్‌డేట్స్, వడ్డీ రేట్లు మరియు ప్రభుత్వ పథకాలపై సరళమైన తెలుగు సమాచారాన్ని నిరంతరం అందించడానికి Postalhelper.comమీతో ఉంది.
✅ ఈ కథనం నచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
✅ మా వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా పోస్టల్ అప్‌డేట్స్ తెలుసుకోండి.
✅ Postal Helper YouTube ఛానెల్ మరియు WhatsApp ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
Postal Helper – మీ పోస్టల్ సేవల నమ్మకమైన తెలుగు మార్గదర్శి.
Disclaimer:- వడ్డీ రేట్లు మరియు నిబంధనలు indiapost/భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ప్రకారం మారవచ్చు.పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి మీ సమీప పోస్ట్ ఆఫీస్ లో నిర్దారించుకోగలరు.


