మీరు GDS ఉద్యోగులా?? Pay Slipలో Professional Tax (PT) అంటే ఏమిటి? ప్రతి నెల ₹200 ఎందుకు కట్ అవుతుంది? పూర్తి వివరాలు!
GDS Pay Slip లో Professional Tax ₹200 ఎందుకు కట్ అవుతుంది? పూర్తి అవగాహన! Gramin Dak Sevak (GDS) ఉద్యోగులైన BPM, ABPMలు తమ Monthly Pay Slip ని చూసినప్పుడు Deductions విభాగంలో "Prof. Tax" (Professional Tax) పేరుతో ₹200 కట్ అవ్వడం గమనిస్తుంటారు. అసలు ఈ పన్ను ఎవరు విధిస్తారు? ఇన్కమ్ టాక్స్ లేకపోయినా ఇది కట్టాలా? జీతం ₹18,000 ఉన్నాఒక్కోసారి ₹200 ఎందుకు కట్ అవుతోంది? అనే సందేహాలకు సమాధానాలు ఈ క్రింది వ్యాసంలో తెలుసుకుందాం. అసలు Professional Tax{PT} అంటే ఏమిటి? ఇది ఎవరు వసూలు చేస్తారు? Professional Tax (వృత్తి పన్ను) అనేది ఏదైనా ఉద్యోగం, వృత్తి లేదా వ్యాపారం ద్వారా ఆదాయం పొందే వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) విధించే పన్ను. ఇది పోస్టల్ డిపార్ట్‌మెంట్ పన్ను కాదు: మీ జీతం నుండి Postal Department ఈ అమౌంట్‌ను డిడక్ట్ చేసి, సంబంధిత State Commercial Tax Department కి జమ చేస్తుంది. భారత రాజ్యాంగంలోని Article 276 ప్రకారం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని ఉద్యోగుల ఆదాయంపై ఈ పన్నును వసూలు చేసే హక్కు కలిగి ఉంటాయి. 👉 GDS Pay Slipలో ₹50 GDSGIS Deduction ఎందుకు? పూర్తి ...