Sukanya Samriddhi Yojana 2026: Post Officeలో ఖాతా ఎలా తెరవాలి? వడ్డీ రేటు, అర్హత, డిపాజిట్, మెచ్యూరిటీ పూర్తి వివరాలు
మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా అయితే ఆమెకి ఇప్పుడే సమృద్ధి యోజన {SSY} ఖాతా తెరవండి.ఆమె బంగారు భవిష్యత్తు కి కారకులు అవ్వండి.
పోస్టాఫీసు అందించే {SSY}-2026 పధకం పూర్తి వివరాలు 
సుకన్య సమృద్ధి యోజన {SSY} 2026--8.2% వడ్డీతో ఆడపిల్లల భవిష్యత్తు కి అద్భుతమైన పొదుపు పధకం
అంశం వివరాలు
పధకం పేరు Sukanya Sammruddi Yojana{SSY}
వడ్డీ రేటు 8.2% {ప్రస్తుతం}
అర్హులు 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలు
కనీస డిపాసిట్ ₹250/-
గరిష్ట డిపాసిట్ ₹150000/-
డిపాసిట్ కాలం 15 సంవత్సరాలు
మెచ్యూరిటీ 21 సంవత్సరాలు
భద్రత భారత ప్రభుత్వ హామీ
సుకన్య సమృద్ధి యోజన అంటే ఏమిటి ?
సుకన్య సమృద్ధి యోజన{SUKANYA SAMRUDDI YOJANA -SSY}అనేది భారత ప్రభుత్వం 2015 లో ప్రారంభించిన అత్యంత సురక్షితమైన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఈ పధకం ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు విద్య మరియు వివాహ అవసరాల కోసం రూపొందించబడింది
పధకం ముఖ్యంశాలు
✅ ఆకర్షణీయమైన వడ్డీ --[ప్రస్తుతం 8.2% వుంది ] గవర్నమెంట్ నిబంధనల ప్రకారం మారవచ్చు
✅ ప్రభుత్వ హామీతో పూర్తి సురక్షితం.
✅ కనీస పెట్టుబడితో ప్రారంభించే అవకాశం {250/-}
✅ ఆదాయ పన్ను ప్రయోజనం {వర్తించే నిబంధనల ప్రకారం}
✅ సాదారణ సేవింగ్స్ కంటే ఎక్కువ వడ్డీ రేటు
✅ ఆడపిల్ల భవిష్యత్తు విద్య,వివాహానికి మంచి ఆర్థిక భరోసా
✅ దేశం లోని ఏ పోస్టాఫీసు లేదా అధీకృత బ్యాంకు కు బదిలీ చేస్కునే అవకాశం
✅ EEE Tax Benfit {పెట్టుబడి,వడ్డీ,మెచ్యురిటి మొత్తం మీద పన్ను మినహాయింపు -అమల్లో ఉన్న ఆదాయపన్ను నిబంధనలకు లోబడి }
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే పథకాలలో మొదటి స్థానం సుకన్య పధకంది మాత్రమే
ఎవరు ఖాతా తెరవవచ్చు ?
🔯10 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న ఆడపిల్లలకు మాత్రమే ఈ ఖాతా తెరవడానికి అవకాశం ఉంటుంది
🔯 తల్లి తండ్రులు లేదా చట్టబద్దమైన సంరక్షకులు తో ఖాతాను ప్రారంభించవచ్చు
🔯 ఒక ఆడపిల్లకి ఒక ఖాతా మాత్రమే అనుమతించబడుతుంది
🔯 తల్లి లేదా తండ్రి ఇద్దరు లేని పక్షంలో మాత్రమే చట్టబద్దమైన సంరక్షకులు తో ఓపెన్ చేయవచ్చు
🔯 గరిష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే అకౌంట్ ఓపెన్ అవుతుంది.
🔯 ఒక కుటుంబంలో ఎంత మంది ఆడ పిల్లలు ఉన్న అర్హులు అనేది పూర్తిగా అవాస్తవం గమనించగలరు కేవలం ఇద్దరికీ మాత్రమే
ఎందుకు ఈ పధకం ప్రత్యేకం?
చిన్నా మొత్తాలతోనే ప్రారంభించి దీర్ఘకాలంలో మంచి వడ్డీతో పెద్ద మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.ఆడపిల్ల ఉన్నత విద్య లేదా వివాహ ఖర్చులకు ఈ పధకం ఎంతో ఉపాయోగపడుతుంది. అలాగే సెక్షన్ 80C నిబంధన ప్రకారం ఇన్కమ్ టాక్స్ ను సేవింగ్స్ లా చూపించుకోవచ్చు.
ఎంత కాలం డబ్బు చెల్లించాలి ?
సుకన్య సమృద్ది యోజన లో ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాలు మాత్రమే డిపోసిట్ చేయాలి.
మరిన్ని 6 సంవత్సరాలు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.అయినప్పటికీ ఖాతాలో ఉన్న మొత్తానికి వడ్డీ కొనసాగుతుంది
అంటే ఖాతా మొత్తం 21 సంవత్సరాల తరువాత మెచ్యూర్ అవుతుంది.
సులభంగా గుర్తుంచుకోండి:-
➨ డిపోసిట్ కాలం -15 సంవత్సరాలు
➨ వేచిఉండే కాలం - 6 సంవత్సరాలు
➨ మొత్తం మెచ్యూరిటీ - 21 సంవత్సరాలు
ఎందుకు పోస్టాఫీసులో సుకన్య ఖాతా తెరవాలి ?
* భారత ప్రభుత్వ పూర్తి భద్రత
* దేశవ్యాప్తంగా పోస్టాఫీసు సేవలు * సులభమైన డిపోసిట్ విధానం
* ఆడపిల్లల భవిష్యత్తుకి విశ్వసనీయమైన పొదుపు
* దీర్ఘకాలం లో మంచి వడ్డీ ప్రయోజనం
* ఇన్కమ్ టాక్స్ పే చేసేవారు వుంటే సెక్షన్ 80C కింద గరిష్టంగా 150000/- రూపాయలు వరకు క్లెయిమ్ చేస్కోవచ్చు
* IPPB APP ద్వారా మీ ఫోన్లోనే అమౌంట్ కట్టుకోవచ్చు
* అన్నిటికన్నా ఉత్తమమైంది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు లేనప్పుడు ఆగవచ్చు అకౌంట్ బ్లాక్ అవ్వడం లేదా లాక్ అవ్వడం లాంటి సమస్యే ఉండదు .
* అలాగే 3 లేదా 4 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ కాలం ఈ అకౌంట్లో డబ్బు వేయకపోయినా కూడా అతి తక్కువ పెనాలిటీ తో సంవత్సరానికి కేవలం 50/-రూపాయలతో మాత్రమే అకౌంట్ ని తిరిగి మళ్ళీ రన్నింగ్ లో పెట్టుకోవచ్చు .
*పన్ను ప్రయోజనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం
కావాల్సిన పత్రాలు:-
👉 ఆడపిల్ల ఆధార్ జెరాక్స్
👉 ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం జెరాక్స్
👉 తల్లి లేదా తండ్రి ఆధార్ జెరాక్స్
👉 తల్లి లేదా తండ్రి పాన్ కార్డు జెరాక్స్
👉 ఆడపిల్లవి 4 పాసుపోర్టు సైజు ఫోటోలు
👉 తల్లి లేదా తండ్రివి 4 పాసుపోర్టు సైజు ఫోటోలు
👉 మొబైల్ నెంబర్ {మీ ఖాతా లావాదేవీలకు సంబంధించి మీకు మెసేజ్ రూపం లో తెలిపేందుకు}
👉 నామినీ ఆధార్ జెరాక్స్
సుకన్య సమృద్ధి యోజన లో డబ్బు ఎప్పుడు తీస్కోవచ్చు ?
✅ పాక్షిక ఉపసంహరణ {PARTIAL WITHDRAWAL}
1. అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తి ఐన తరువాత లేదా 10వ తరగతి తరువాత ఉన్నత విద్యకోసం ఖాతాలో మొత్తం లో గరిష్టంగా 50% వరకు తీస్కోవచ్చు . 2.విద్యా ఖర్చులకు సంబంధించిన అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు రసీదు వంటి పత్రాలు అవసరం కావచ్చు
✅ పూర్తి మెచ్యూరిటీ {FULL MATURITY}
1.ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాలు పూర్తైన తరువాత మొత్తం డబ్బు మరియు వడ్డీతో కలిపి పొందవచ్చు
✅ ముందస్తు మూసివేత {PREMATURE CLOUSER}
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే అవకాశం ఉంటుంది
1.ఖాతాదారులు{అమ్మాయి} మరణించినప్పుడు
2.తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి
3.ఇతర ప్రభుత్వం అనుమతించిన ప్రత్యేక కారణాలు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
Q1. ఒక కుటుంబంలో ఎన్ని SSY ఖాతాలు తెరవవచ్చు?
👉 సాధారణంగా ఇద్దరు ఆడపిల్లలకు రెండు ఖాతాలు. ప్రత్యేక పరిస్థితుల్లో (ఉదా: కవలలు) నిబంధనల ప్రకారం మినహాయింపులు ఉండవచ్చు.
Q2. కనీస డిపాజిట్ చేయకపోతే?
👉 ఖాతా డిఫాల్ట్ అవుతుంది. నిర్ణయించిన ఫీజు చెల్లించి మళ్లీ యాక్టివ్ చేయవచ్చు.
Q3. సంవత్సరంలో ఎన్నిసార్లు డిపాజిట్ చేయవచ్చు?
👉 ఒకేసారి లేదా అనేక విడతలుగా చేయవచ్చు. అయితే మొత్తం వార్షిక డిపాజిట్ పరిమితి ₹1.5 లక్షలు.
Q4. ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేయవచ్చా?
👉 India Post Internet Banking లేదా IPPB ద్వారా, అందుబాటులో ఉన్న సౌకర్యాల ప్రకారం డిపాజిట్ చేయవచ్చు.
ఇంకొన్ని విషయాలు మీకోసం
1. వడ్డీ లెక్కింపు ఎలా జరుగుతుంది?
ప్రతి నెల 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఖాతాలో ఉన్న కనిష్ట బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కిస్తారు (అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం).
ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి (Quarter) వడ్డీ రేటును ప్రకటిస్తుంది.
2. ముఖ్యమైన సూచనలు
డిపాజిట్‌ను ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 – మార్చి 31) పూర్తి చేయండి.
పాస్‌బుక్‌ను జాగ్రత్తగా ఉంచండి.
KYC వివరాలు మారితే వెంటనే అప్‌డేట్ చేయండి.
నామినేషన్ (Nomination) సంబంధిత నిబంధనలు ఖాతా రకం ప్రకారం తెలుసుకోండి.
3. ఎవరు తప్పకుండా SSY ఖాతా తెరవాలి?
10 సంవత్సరాల లోపు ఆడపిల్ల ఉన్న కుటుంబాలు.
భవిష్యత్ విద్య కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రులు.
ప్రభుత్వ హామీతో భద్రమైన పెట్టుబడి కోరుకునేవారు.
4. సాధారణంగా జరిగే పొరపాట్లు
కనీస వార్షిక డిపాజిట్ చేయకపోవడం.
డిపోసిట్ కి చివరి తేదీ వరకు వేచి ఉండటం.
ఖాతా వివరాలు సరిగా నిర్వహించకపోవడం.
సుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రతి ఆడపిల్ల భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందించే అత్యుత్తమ ప్రభుత్వ పొదుపు పథకాలలో ఒకటి. చిన్న మొత్తాలతో ప్రారంభించి, అధిక వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉండటం వల్ల ప్రతి అర్హత కలిగిన కుటుంబం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.
మీ అందరికి అర్థమయ్యేలా చిన్న పట్టిక రూపంలో
నెలవారీ డిపోసిట్ తీసుకునే మొత్తం సొమ్ము
250/- 45,000/- 1,38,647/-
500/- 90,000/- 2,77,306/-
1000/- 1,80,000/- 5,54,613/-
1500/- 2,70,000/- 8,31,913/-
2000/- 3,60,000/- 11,09,218/-
5000/- 9,00,000/- 27,73,058/-
10000/- 18,00,000/- 55,46,117/-
12500/- 22,50,000/- 69,32,648/-
సింపుల్ గా చెప్పాలంటే 1:3 రిటర్న్స్ 1 లక్షకి 3 లక్షలు అన్నట్టు {కొంచెం అటు ఇటు మార్పులు ఉండొచ్చు }
ముగింపు
మీ ఇంట్లో 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆడపిల్ల ఉంటే, ఆమె భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన ఒక అద్భుతమైన ఎంపిక. చిన్న మొత్తాలతో ప్రారంభించి, మంచి వడ్డీతో పెద్ద మొత్తాన్ని పొందే అవకాశం ఈ పథకం అందిస్తుంది.
📌 మరిన్ని పోస్టల్ సేవల వివరాల కోసం
ఈ INDIAPOST SUKANYA SAMMRUDDI YOJANA {SSY} గురించి సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.
పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, NSC, KVP, MIS, PPF, SSY, PLI, IPPB, పోస్టల్ అప్‌డేట్స్, వడ్డీ రేట్లు మరియు ప్రభుత్వ పథకాలపై సరళమైన తెలుగు సమాచారాన్ని నిరంతరం అందించడానికి Postalhelper.comమీతో ఉంది.
✅ ఈ కథనం నచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
✅ మా వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా పోస్టల్ అప్‌డేట్స్ తెలుసుకోండి.
✅ Postal Helper YouTube ఛానెల్ మరియు WhatsApp ఛానెల్‌ను ఫాలో అవ్వండి.
Postal Helper – మీ పోస్టల్ సేవల నమ్మకమైన తెలుగు మార్గదర్శి.
Disclaimer:- వడ్డీ రేట్లు మరియు నిబంధనలు indiapost/భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ప్రకారం మారవచ్చు.పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి మీ సమీప పోస్ట్ ఆఫీస్ లో నిర్దారించుకోగలరు.
ధన్యవాదాలు

