**మీరు GDS ఉద్యోగులా? Salaryలో ₹50 ఎందుకు కట్ అవుతోంది? | GIS-II ₹50, ₹50,000 Insurance Cover & GDSGIS Benefits 2026** పూర్తి వివరాలు
GDS Salary Slipలో GIS-II అంటే ఏమిటి? ₹50 కట్ చేస్తే ఎంత కవరేజ్? పూర్తి వివరాలు India Postలో Gramin Dak Sevak (GDS) ఉద్యోగుల Salary Slipలో కనిపించే GIS-II / GDSGIS అనే Deduction చాలామందికి పూర్తిగా అర్థం కాదు. ప్రతి నెల ₹50 కట్ అవుతున్నప్పటికీ,ఎందుకు కట్ అవుతున్నాయోకొంతమందికి తెలీదు.ఒకవేళ తెలిసిన ఆ ₹50 మొత్తం Insurance Premium కాదు. ఇందులో ఒక భాగం Insurance Fund కు, మరో భాగం Savings Fund కు వెళ్తుంది. అసలు ఈ ₹50 వల్ల GDS ఉద్యోగికి ఎంత Insurance Cover వస్తుంది? ఉద్యోగంలో ఉండగా మరణిస్తే కుటుంబానికి ఎంత వస్తుంది? Retirement లేదా Resignation సమయంలో ఏ మొత్తం తిరిగి వస్తుంది? తెలుసుకుందాం. 💓GDSGIS అంటే ఏమిటి? GDSGIS = Gramin Dak Sevak Group Insurance Scheme ఇది GDS ఉద్యోగులకు సంబంధించిన Group Insurance + Savings పథకం. ఈ Scheme ద్వారా GDS ఉద్యోగికి Serviceలో ఉన్న సమయంలో Life Risk Cover అందించడంతో పాటు, Contributionలోని Savings Fund భాగం వడ్డీతో కలిసి Membership ముగిసినప్పుడు చెల్లించబడుతుంది. Department of Posts అధికారిక ఆర్థిక పత్రాల్లో కూడా GDSGIS-2010 Insurance Fund మరియు GDSGIS-...