Post Office Savings Account 2026 in Telugu | వడ్డీ రేటు, నిబంధనలు పూర్తి వివరాలు
Post Office Savings Account 2026: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ పూర్తి వివరాలు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account) అనేది ప్రజలు తమ డబ్బును సురక్షితంగా దాచుకోవడానికి ఉపయోగపడే ప్రముఖ పొదుపు పథకం. బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ మాదిరిగానే ఇందులో డబ్బు జమ చేయడం, అవసరమైనప్పుడు ఉపసంహరించుకోవడం, అర్హతను బట్టి ఇతర బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవడం వంటి సదుపాయాలు ఉంటాయి. గమనిక:-ప్రభుత్వ మరియు ప్రైవేట్ అన్ని బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు కన్నా పోస్టాఫీసు వడ్డీ రేటు{Interest} ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం తపాలశాఖ గరిష్టంగా సేవింగ్స్ అకౌంట్{SB} మీద 4% వడ్డీ ఇస్తుంది మీరు చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించాలనుకుంటున్నారా? పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ తెరవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్‌లో వడ్డీ రేటు, కనీస డిపాజిట్, ఖాతాల రకాలు, మైనర్ అకౌంట్, డబ్బు విత్‌డ్రాయల్, వడ్డీ లెక్కింపు, ఖాతా నిర్వహణ ఛార్జీలు, ఆన్లైన్ సేవలు వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. Post Office Savings Account అంటే ఏమిటి? పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది భారత తపాలా శాఖ ద్వారా ...