🏤 Post Office Monthly Income Scheme (MIS) – పూర్తి వివరాలు, ప్రయోజనాలు, వడ్డీ లెక్కలు 💰 ఒక్కసారి డబ్బుని పెట్టుబడిగా పెట్టండి… ప్రతి నెలా ఆదాయం పొందండి.
💰 Post Office Monthly Income Scheme (MIS) – ప్రతి నెలా వడ్డీ ఆదాయం కావాలా? అయితే ఈ పథకం మీకోసమే! “నా దగ్గర కొంత మొత్తం ఉంది… దాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే ప్రతి నెలా కొంత ఆదాయం వస్తుంది?” ఇలాంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు, నెలవారీ అదనపు ఆదాయం కోరుకునే వారు, లేదా పెళ్ళికి కట్నం లాంటివి అందుకున్న వారు తమ పొదుపు మొత్తాన్ని సురక్షితమైన మార్గంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఇలాంటి పథకాల కోసం చూస్తుంటారు. మీ దగ్గర ఉన్న పొదుపు మొత్తాన్ని సురక్షితంగా పెట్టుబడి పెట్టి, ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం పొందాలనుకునే వారికి Post Office Monthly Income Scheme (MIS) ఒక మంచి ఎంపిక. Post Office MIS అనేది భారత ప్రభుత్వ మద్దతుతో నడిచే చిన్న పొదుపు పథకం . ఇందులో ఒకేసారి మొత్తం పెట్టుబడి చేసి, దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పొందవచ్చు. ⭐ MIS పథకం ముఖ్యాంశాలు 🔹 పథకం పేరు: Post Office Monthly Income Scheme (MIS) 🔹 పెట్టుబడి విధానం: ఒకేసారి మొత్తం జమ చేయాలి 🔹 వడ్డీ: ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం{ప్రస్తుతం 7.4% ఉంది} 🔹 వడ్డీ చెల్లింపు: ప్ర...