కేవలం రోజుకి 2 రూపాయలతో 15 లక్షలు వచ్చే ప్రమాద భీమా గురించ్జి మీకు తెలుసా IPPB Accident Insurance 2026: 750/-కె ₹15 లక్షల రక్షణ? Premium, Eligibility, Benefits పూర్తి వివరాలు

🚨 ఒక్క ప్రమాదం... కుటుంబం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో పడొచ్చు!

👉 అందుకే ముందుగానే Accident Insurance గురించి తెలుసుకోండి

మనకు ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు.

రోజూ ఉద్యోగానికి వెళ్లడం, బైక్‌పై ప్రయాణించడం, బయట పనులు చేసుకోవడం.ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమే.ఒక్కోసారి మనం చేసే పనులు కూడా ప్రమాదకరమైన పనులే కానీ తప్పదు చేయాలి.

అలాంటప్పుడు  ఒక అనుకోని ప్రమాదం జరిగితే?

చికిత్స ఖర్చులు ఒకవైపు... కుటుంబ ఆదాయానికి ఇబ్బంది మరోవైపు...

అలాంటి సమయంలో కొంత ఆర్థిక భద్రత ఉండటం కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది.

🛡️ IPPBలో Accident Insurance ఎందుకు తెలుసుకోవాలి?

India Post Payments Bank (IPPB) ద్వారా అందుబాటులో ఉన్న Personal Accident Insurance పథకాల గురించి చాలామందికి పూర్తిగా తెలియదు.కేవలం 550/- లేదా 750/- లేదా 799/- రూపాయలతో 1సంవత్సరం మొత్తం 10 నుంచి  15 లక్షల  కవరేజ్ వస్తుంది  

మనం ఫామిలీ తో కానీ ఫ్రెండ్స్ తో కానీ ఒకరోజు ఖర్చుపెట్టినంత  రెస్టారెంట్ బిల్ అంత కూడా ఉండదు కానీ సంవత్సరం మొతం కవరేజ్  వస్తుంది ఆలోచించండి 

ప్రమాదం వల్ల పాలసీ నిబంధనలకు అనుగుణంగా మరణమేకాదు   ఏదైనా చిన్న దెబ్బలు తగిలిన లేదా  నిర్దిష్ట శాశ్వత వైకల్యం వంటి పరిస్థితులు ఏర్పడితే, పాలసీ ప్రకారం బీమా ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది.

అంటే మనకు ఏమీ కాకపోతే బాగానే ఉంటుంది.

కానీ అనుకోకుండా ప్రమాదం జరిగితే కుటుంబానికి కొంత ఆర్థిక అండగా ఉండేలా ముందుగానే రక్షణ తీసుకోవడం అన్నమాట.

IPPB  లో ACCIDENTAL ఇన్సూరెన్సు కి కావాల్సినవి 

⭐ ముందుగా కస్టమర్ IPPB ఖాతా దారుడై ఉండాలి.

⭐ ఖాతా దారు ఆధార్ కార్డు జెరాక్స్ 

⭐ నామినీ ఆధార్ జెరాక్స్ 

⭐ పాలసీ ని బట్టి 350 నుంచి  800/- వరకు నగదు అకౌంట్ లో ఉండాలి 

⭐ 50 లక్షల కవరేజ్ కావాలనుకుంటే 2700 నగదు కావాలి 

⭐ పాలసి దారుడికి 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉండాలి  

పాలసీ యోక్క కవరేజ్ లు 

1.పాము కాటు  తెలు కాటు
2. వాహన ఆక్సిడెంట్ 
3.ఫ్లడ్స్ {నీటి ప్రమాదాలు }మరియు అగ్ని ప్రమాదాలు 
4.సాదారణ మరణాలు కి అస్సలు కవరేజ్ ఉండదు అలాగే హార్ట్ అటాక్ లాంటి వాటికీ కూడా కవరేజ్ వర్తించదు  

💡 “నాకు ఏమీ జరగదు” అనుకోవడం కంటే!

మనలో చాలామంది:“నాకు ప్రమాదం జరగదుఅని అనుకుంటాం.అది సహజమే.

కానీ ప్రమాదం అనేది చెప్పి రాదు.

అందుకే ప్రమాదం జరిగిన తర్వాత ఆలోచించడం కంటే, ముందుగానే ఆర్థిక రక్షణ గురించి ఆలోచించడం మంచిది.

💰 Accident Insurance తీసుకుంటే ఏం ప్రయోజనం?

పాలసీ మరియు దాని నిబంధనలను బట్టి ప్రయోజనాలు మారుతాయి.

సాధారణంగా ప్రమాదం వల్ల కలిగే కొన్ని పరిస్థితుల్లో:

ఉదాహరణకి 750/- రూపాయల పాలసీ తీసుకుంటే 

✅ Accidental Death  1500000/- రూపాయలు 


✅ Permanent Disability వంటి పరిస్థితులకు 1500000/- రూపాయలు 


✅ పాలసీ ప్రకారం కుటుంబానికి/బీమా చేసిన వ్యక్తికి ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం                    ఉంటుంది

✅ AUTO డెబిట్ సౌకర్యం కూడా ఉంది  .

✅ ప్రమాదం లో దెబ్బలు తగిలి చేయి లేదా కాలు విరగడం ఇంకా ఏవైనా చికిత్సల కోసం గరిష్టం గా 100000/-రూపాయలు వరకు క్లెయిమ్ అవుతాయి 

✅ అలాగే కుటుంభం రవాణా ఖర్చు కి 25000/-రూపాయలు

✅ అంత్యక్రియలు టైం లో 5000/-రూపాయలు 

✅ ఇద్దరి పిల్లల చదువు కోసం గరిష్టంగా  100000/- రూపాయలు 

అయితే ప్రతి పాలసీకి నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి.

అందుకే కేవలం Cover Amount చూసి పాలసీ తీసుకోకుండా, పూర్తి Policy Terms & Conditions తెలుసుకోవడం చాలా ముఖ్యం.

👨‍👩‍👧‍👦 మనం లేకపోతే... కుటుంబం పరిస్థితి ఏంటి?

ఇది ప్రతి కుటుంబం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం.

కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగితే, కుటుంబ ఆదాయంపై ప్రభావం పడవచ్చు.

అలాంటి సమయంలో ముందుగానే తీసుకున్న సరైన బీమా రక్షణ కుటుంబానికి కొంత ఆర్థిక అండగా నిలిచే అవకాశం ఉంటుంది.

అందుకే Insurance అంటే భయపడేవాళ్ల కోసం కాదు.

బాధ్యతగా ఆలోచించే కుటుంబాల కోసం. ❤️


📌 పాలసీ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

పాలసీ తీసుకునే ముందు ఈ వివరాలను స్పష్టంగా తెలుసుకోవాలి:

🔹 ఎంత Coverage వస్తుంది?
🔹 Premium ఎంత?
🔹 ఎవరు తీసుకోవచ్చు?
🔹 Age Limit ఎంత?
🔹 ఏ ప్రమాదాలకు Cover ఉంటుంది?
🔹 ఏ పరిస్థితులకు Cover ఉండదు?
🔹 Claim ఎలా చేయాలి?
🔹 ఏ Documents అవసరం?

ఈ వివరాలు పాలసీని బట్టి మారవచ్చు.

                

⚠️ ముఖ్యమైన విషయం

Accident Insurance అనేది Health Insuranceకు ప్రత్యామ్నాయం కాదు.

Health Insurance ప్రధానంగా వైద్య ఖర్చుల రక్షణ కోసం ఉపయోగపడుతుంది.

Accident Insurance మాత్రం ప్రమాదం వల్ల పాలసీలో పేర్కొన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్ట ఆర్థిక రక్షణ అందించడానికి ఉంటుంది.

అందుకే రెండింటి మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

🏤 IPPB ద్వారా తెలుసుకోవడం ఎలా?

IPPBలో అందుబాటులో ఉన్న Accident Insurance వివరాలను తెలుసుకోవాలంటే మీకు సమీపంలోని IPPB/Post Office సేవా కేంద్రం లేదా అధికారిక IPPB మార్గాల ద్వారా ప్రస్తుత పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు.

పాలసీ తీసుకునే ముందు తాజా Premium, Coverage, Eligibility మరియు Terms & Conditions తప్పనిసరిగా నిర్ధారించుకోండి.


❤️ చిన్న ప్రీమియం... పెద్ద బాధ్యతకు ఒక అడుగు!

మన కుటుంబ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తాం.

పిల్లల చదువుల కోసం డబ్బు దాచుకుంటాం.

అదే విధంగా...

అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ముందుగానే రక్షణ గురించి ఆలోచించడం కూడా మన బాధ్యతే.

👉 “ప్రమాదం జరుగుతుందా?” అని ఆలోచించే బదులు...

👉 “ప్రమాదం జరిగితే నా కుటుంబానికి అండగా ఏముంది?” అని ఆలోచిద్దాం.

📌 మరిన్ని పోస్టల్ సేవల వివరాల కోసం

ఈ INDIA POST PAYMENTS BANK{IPPB} గురించి ఈ  సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, NSC, KVP, MIS, PPF, SSY, PLI, IPPB, పోస్టల్ అప్‌డేట్స్, వడ్డీ రేట్లు మరియు ప్రభుత్వ పథకాలపై సరళమైన తెలుగు సమాచారాన్ని నిరంతరం అందించడానికి Postalhelper.comమీతో ఉంది.

✅ ఈ కథనం నచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
✅ మా వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా పోస్టల్ అప్‌డేట్స్ తెలుసుకోండి.
✅ Postal Helper YouTube ఛానెల్ మరియు WhatsApp ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

Postal Helper – మీ పోస్టల్ సేవల నమ్మకమైన తెలుగు మార్గదర్శి.

📢 గమనిక: Insurance coverage, premium, eligibility, exclusions మరియు claim conditions పాలసీ/Insurance Company నిబంధనలపై ఆధారపడి ఉంటాయి. పాలసీ తీసుకునే ముందు తాజా అధికారిక వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి.



Comments

Popular Posts

**మీరు GDS ఉద్యోగులా? Salaryలో ₹50 ఎందుకు కట్ అవుతోంది? | GIS-II ₹50, ₹50,000 Insurance Cover & GDSGIS Benefits 2026** పూర్తి వివరాలు

🔥 India Post Beat Mechanization 2026: Branch Post Office లలో కొత్త మార్పులు – GDS & ABPMలకు పూర్తి వివరాలు

BPMగా పనిచేస్తున్నారా? Branch Post Officeలో రాబోయే ఈ మార్పుల గురించి మీకు తెలుసా? POSB & Savings Schemesపై పూర్తి వివరాలు