POSTOFFICE NSC ACCOUNT FULL DETAILS -2026 – చిన్న పెట్టుబడి… భవిష్యత్తుకు బలమైన పొదుపు! 📮 NSC అంటే ఏమిటి? పెట్టుబడి, వడ్డీ, 80C ప్రయోజనాలు పూర్తి వివరాలు!

                          

NSC VIII (National Savings Certificate)

చిన్న పొదుపు… భవిష్యత్తుకు బలమైన భద్రత!💰

National Savings Certificate (NSC) అనేది పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ప్రముఖ చిన్న పొదుపు పథకం. సురక్షితమైన పెట్టుబడితో పాటు నిర్ణీత కాలానికి వడ్డీ పొందాలనుకునే వారికి NSC ఒక ఉపయోగకరమైన ఎంపిక.

📌 NSC ముఖ్యమైన అంశాలు

  • 🏤 పెట్టుబడి: పోస్టాఫీస్ ద్వారా ప్రారంభించవచ్చు

  • 💰 కనీస పెట్టుబడి: ₹1,000 నుంచి

  • 📈 వడ్డీ: ప్రభుత్వం నిర్ణయించే రేటు ప్రకారం{ప్రస్తుతం 7.7%  గా ఉంది}

  • ⏳ కాలపరిమితి: 5 సంవత్సరాలు

  • 🔒 భద్రత: ప్రభుత్వ ఆధారిత చిన్న పొదుపు పథకం

  • 👨‍👩‍👧 ఎవరికి ఉపయోగకరం? వ్యక్తిగత పొదుపు మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం.

  •  ✅ పన్ను ప్రయోజనం : నిబంధనల ప్రకారం ఆదాయపన్ను ప్రయోజనం  

🌟 NSC  ఖాతా ఎవరు తెరవవచ్చు ?

1} అర్హుడైన   ప్రతీభారతీయ పౌరులు 
2} గరిష్టంగా 3 పెద్దవాళ్ళు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్కోవచ్చు  
3}మైనర్ లేదా తన వ్యవహారాలను స్వయంగా నిర్వహించలేని వ్యక్తి తరఫున, వారి సంరక్షకుడు ఖాతాను నిర్వహించడం.
4}10 సంవత్సరాలు దాటిన మైనర్ కూడా అర్హులు 

🌟 NSC ఎందుకు ప్రత్యేకం?

NSCలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పొదుపును క్రమంగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా రిస్క్ తక్కువగా ఉండే ప్రభుత్వ పొదుపు పథకం కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఎంపిక.

అదే విదంగా సింగల్ గాను అకౌంట్ ఓపెన్ చెయ్యొచ్చు. గరిష్టం గా 3 పెద్దవాళ్ళు కూడా ఓపెన్ చెయ్యొచ్చు 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం NSCలో మీరు పెట్టే డబ్బుకు, వర్తించే నిబంధనల ప్రకారం Income Tax Act Section 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం పొందవచ్చు.

🌟 NSC  ని PLEDGE చేయడం 

NSC  ని భద్రతగా తాకట్టు పెట్టవచ్చు లేదా బదిలీ చేయవచ్చు 

ఇందుకోసం సంబంధిత పోస్టాఫీసు లో దరఖాస్తు ఫారం మరియు అంగీకార పత్రం అవసరం 
NSC ని ఈ సంస్థలు/వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టవచ్చు 

1.భారత రాష్ట్రపతి/ రాష్ట్ర గవర్నర్ 
2.RBI /SHEDULED BANK /కో-ఆపరేటివ్ సొసైటీ /కో-ఆపరేటివ్ బ్యాంకు 
3.ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీ / స్థానిక సంస్థ 
4.హౌసింగ్  ఫైనాన్స్ కంపెనీ 

మెచ్యూరిటీ 

ఖాతా ఓపెన్ చేసిన తేదీ నుంచి 5 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత మాత్రమే ఖాతా మెచ్యూర్ అవుతుంది 

PRE మెచ్యూరిటీ / పాక్షిక ఉపసంహరణ 

సాధారణంగా 5 సంవత్సరాలు పూర్తికాకుండా NSC  ని మూసివేయలేరు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ముందుగా మూసివేయవచు 
1}ఖాతా దారుడు మరణించినప్పుడు 
2}జాయింట్ ఖాతా లో ఒకరు లేదా అందరూ మరణించినప్పుడు 
3}NSC ని తాకట్టు తీసుకున్న వ్యక్తి GAZITED OFFICER  అయితే 
4}కోర్ట్ ఆదేశాలు ఉంటే 

ఖాతా ని ఎక్కడ తెరవవచ్చు ?

మీ సమీప మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఏ పోస్టాఫీసు లో ఐన ఖాతా తెరవవచ్చు దానిని                SUB OFFICE/ఉప తపాలా కార్యాలయం అని కూడా అంటారు  

NSC ఖాతా ని ఒకరినుంచి మరొకరికి బదిలీ చేయడం 

NSC ఖాతా ని ఒక వ్యక్తి పేరు నుంచి మరొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. కానీ దానికి నిర్దిష్ట నిబంధనలు /పరిస్థితుల మీద ఆధారపడి  ఉంటుంది 
1. ఖాతా దారుడు మరణించినప్పుడు నామినీ కి బదిలీ చేయవచ్చు 
2.ఖాతాదారుడు మరణించినప్పుడు జాయింట్ హోల్డర్స్ కి 
3.కోర్ట్ ఆదేశాల మేరకు 
4.నిర్దేశించిన అధికార  సంస్థకి NSC ను తాకట్టు పెట్టినపుడు  

కావాల్సిన పత్రాలు 

1.ఆధార్ జెరాక్స్ 
2.పాన్ కార్డు జెరాక్స్ 
3.4 పాసుపోర్టు సైజు ఫోటోలు 
4.సంరక్షకులు అయితే లీగల్ సర్టిఫికెట్ 
5.మొబైల్ నెంబర్ 
6.నామినీ ఆధార్ జెరాక్స్ 

💡 గుర్తుంచుకోవాల్సిన విషయం

NSCకి సంబంధించిన వడ్డీ రేట్లు, పన్ను ప్రయోజనాలు, నిబంధనలు మరియు పెట్టుబడి పరిమితులు ప్రభుత్వం/పోస్టాఫీస్ తాజా నిబంధనల ప్రకారం మారవచ్చు. పెట్టుబడి చేసే ముందు తాజా వివరాలను తప్పనిసరిగా పరిశీలించండి.

📮 NSC – ముగింపు

National Savings Certificate (NSC) అనేది క్రమశిక్షణతో పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ప్రముఖ చిన్న పొదుపు పథకం. నిర్ణీత కాలానికి పెట్టుబడి చేసి, వర్తించే నిబంధనల ప్రకారం వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

💡 మీ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా పొదుపు చేయడం ఈరోజే ప్రారంభించండి.

📌 మరిన్ని పోస్టల్ సేవల వివరాల కోసం

ఈ India Post Payments Bank{IPPB} గురించి సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, NSC, KVP, MIS, PPF, SSY, PLI, IPPB, పోస్టల్ అప్‌డేట్స్, వడ్డీ రేట్లు మరియు ప్రభుత్వ పథకాలపై సరళమైన తెలుగు సమాచారాన్ని నిరంతరం అందించడానికి Postalhelper.comమీతో ఉంది.

✅ ఈ కథనం నచ్చితే మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి.
✅ మా వెబ్‌సైట్‌ను తరచూ సందర్శించి తాజా పోస్టల్ అప్‌డేట్స్ తెలుసుకోండి.
✅ Postal Helper YouTube ఛానెల్ మరియు WhatsApp ఛానెల్‌ను ఫాలో అవ్వండి.

Postal Helper – మీ పోస్టల్ సేవల నమ్మకమైన తెలుగు మార్గదర్శి.

Disclaimer:- వడ్డీ రేట్లు మరియు నిబంధనలు indiapost/భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల ప్రకారం మారవచ్చు.పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి మీ సమీప పోస్ట్ ఆఫీస్ లో నిర్దారించుకోగలరు.

               ధన్యవాదాలు



Comments

Popular Posts

**మీరు GDS ఉద్యోగులా? Salaryలో ₹50 ఎందుకు కట్ అవుతోంది? | GIS-II ₹50, ₹50,000 Insurance Cover & GDSGIS Benefits 2026** పూర్తి వివరాలు

🔥 India Post Beat Mechanization 2026: Branch Post Office లలో కొత్త మార్పులు – GDS & ABPMలకు పూర్తి వివరాలు

BPMగా పనిచేస్తున్నారా? Branch Post Officeలో రాబోయే ఈ మార్పుల గురించి మీకు తెలుసా? POSB & Savings Schemesపై పూర్తి వివరాలు